23, ఏప్రిల్ 2012, సోమవారం

  
నిన్న రాత్రి వెన్నెలతో
కమ్మని కబురంపినాను
తలపు పూల నెత్తావుల
పరిమళాల నందించమనీ 
వేవేగమె నిన్ను చేరి
నిముసమైన ఆగలేక
నీకై వేచుండే నా మనసు
వేగు పదిలంగా  పంచమనీ
నిన్నరాత్రి వెన్నెలతో...............
చల్ల గాలి తేరుపైన తేట  తేనెపెదవులద్ది 
సుందర చిత్రాలనెన్నో నీ వాకిట
సప్తవర్ణ సంబరాల ముగ్గులుగా కూర్చిపేర్చి
నా విన్నపాల స్వగతాలు పలకమనీ
నిన్నరాత్రి వెన్నెలతో ..............

ఒక జీవిత కాలం
అది ఏమూలకుకాకున్నా
ఎందుకీ ప్రయాసలంటు ఎందరెంత  నిరసించినా
ఏటి పాలు ఇక మీ రాయభారమని నెన్నుదుటనె అన్నా
ఎన్ని జీవితాలైనా ఏటి గట్టు పాటలాగ
ఎన్ని యుగాల ఎదురు చూపైనా
ఆరిపోని ఆసూర్యుడి వెలుగు లాగ
ఆగిపోని స్వప్నమిదీ
నిన్నరాత్రి వెన్నెలతో.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి